: నేడు ఇండియా పతక ఖాతా తెరిచే అవకాశం... 130 కోట్ల మంది ఆశ!

130 మంది కోట్ల భారతీయులు నేటి రియో ఒలింపిక్స్ పోటీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. నేడు పలు విభాగాల్లో ఫైనల్స్ ఉండటం, వాటిల్లో భారతీయులు పోటీ పడనుండటంతో కనీసం ఓ పతకమైనా ఇండియాకు లభించాలని గట్టిగా కోరుకుంటున్నారు. స్టిపుల్ చేజ్ విభాగంలో లలితా బబ్బర్, 32 సంవత్సరాల తరువాత ఫైనల్స్ కు ఎంపికైన మహిళా ట్రాక్ అథ్లెట్ గా నిలిచింది. ఇదే సమయంలో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నేడు ఫైనల్ పోరుకు దిగనుండగా, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, మిక్సెడ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో కలసి కాంస్య పతకం కోసం చెక్ రిపబ్లిక్ జోడీ రాడిక్ స్టెపానిక్, లూసీ హర్డెకా జోడీతో పోటీ పడనుంది. దీపా పాల్గొనే వాల్ట్ ఫైనల్ కు ముందుగానే సానియా జోడీ మ్యాచ్ జరుగనుంది. దాదాపు 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ, ఒక్క పతకాన్ని కూడా ఇంతవరకూ సాధించలేకపోయిన భారత్ నేడు పతక ఖాతాను తెరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

More Telugu News