: పుష్కరాలు రాకుంటే శ్రీశైలం జలాశయం నిండి ఉండేది!

కృష్ణా పుష్కరాలు రాకుంటే శ్రీశైలం జలాశయం ఈపాటికే నిండి ఉండేదని తెలుస్తోంది. కృష్ణా పుష్కరాలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల పుణ్య స్నానాలకు అవసరమైన నీటిని విడుదల చేస్తున్నందునే శ్రీశైలం డ్యామ్ ఇంకా నిండలేదు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, మూడు రోజుల క్రితమే 877 అడుగులకు నీరు చేరింది. ఆపై పుష్కర అవసరాల నిమిత్తం వస్తున్న వరద నీటి కన్నా, అధికంగా దిగువకు వదలడం ప్రారంభమైంది. దీంతో రిజర్వాయర్ లో నీరు పెరుగకపోగా, స్వల్పంగా తగ్గింది. ఈ ఉదయం 8 గంటలకు 875 అడుగుల మేరకు నీరుండగా, 46,600 క్యూసెక్కుల నీరు వస్తోంది. వస్తున్న నీటితో పోలిస్తే, రెట్టింపు నీటిని... అంటే 84,104 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్ కు చేరుతోంది. సాగర్ కు 70,278 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాన్ని కాస్తంత నెమ్మదిగా 16,621 క్యూసెక్కుల చొప్పున దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 163 టీఎంసీలు, సాగర్ లో 137 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

More Telugu News