ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయీమ్ వేసిన ఆడవేషం... చిత్రాన్ని మీరూ చూడండి!

Sun, Aug 14, 2016, 06:42 AM
Related Image ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చిన వేళ, పోలీసులు అనుమానించకుండా గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆడవేషంలో సంచరిస్తూ ఉండేవాడన్న కథనాలకు బలం చేకూరుస్తూ, పోలీసులకు నయీమ్ ఆడవేషం వేయించుకుని తీయించుకున్న ఫోటోలు దొరికాయి. చక్కగా నీలిరంగు లంగా, జాకెట్ ధరించి, చున్నీని చేతులకు చుట్టుకుని, మెడలో బంగారు గొలుసులు, పాపటి బిళ్ల, తలలో కనకాంబరాలు పెట్టుకుని తీయించుకున్న ఫోటో సిట్ సోదాల్లో బయటపడింది.

ఆయన ఇంట్లో విగ్గులు, ఖరీదైన మేకప్ కిట్ లు, పలు రకాల మహిళల దుస్తులు లభించిన సంగతి తెలిసిందే. అమ్మాయిలను, మహిళలనూ వెంటబెట్టుకుని వాహనాల్లో వెళుతుంటే, పెద్దగా అనుమానించరని, సోదాల సమయంలోనూ వెనుకంజ వేస్తారని నయీమ్ గట్టిగా నమ్మేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అల్కాపురిలో ఆయన ఉంటున్న ఇంట్లో హత్యలు కూడా జరిగాయన్న విషయాన్ని.. అరెస్ట్ చేసిన ఫర్హానా, అఫ్సాల నుంచి తెలుసుకున్నామని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Articles (Latest)
Articles (Education)