: కేంద్రం ఎటువంటి ఎడ్యుకేష‌న్ పాల‌సీని త‌యారు చేయ‌లేదు: ప్రకాశ్‌ జవదేకర్‌

హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి కడియం శ్రీహరి భేటీ ముగిసింది. ఈ సంద‌ర్భంగా ప్రకాశ్‌ జవదేకర్ మాట్లాడుతూ... దేశంలో ఎడ్యుకేషన్ సెక్టార్‌ను ఏ విధంగా మార్పు చేయాలనే అంశంపైన, తెలంగాణ ప్రాథ‌మిక, ఉన్న‌త విద్య‌పైన స‌మీక్ష నిర్వ‌హించామ‌ని చెప్పారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం కోరిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఎటువంటి ఎడ్యుకేష‌న్ పాల‌సీని త‌యారుచేయ‌లేదని, ఎడ్యుకేష‌న్ పాల‌సీపై త‌మ‌కు సెప్టెంబ‌రు 15 వ‌ర‌కు సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని సూచించారు. ఈ సందర్భంగా కడియం శ్రీ‌హ‌రి మాట్లాడుతూ.. తెలంగాణ‌లో విద్యాశాఖ ప‌నితీరుపై జ‌వ‌దేక‌ర్ సంతృప్తి వ్య‌క్తం చేశారని అన్నారు. పాఠశాల విద్యా కమిటీల పనితీరును జవదేకర్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇంజినీరింగ్, డీఈడీ, బీఈడీ కాలేజీల అనుమ‌తుల‌పై దృష్టి పెట్టాల‌ని జ‌వ‌దేక‌ర్‌ను తాము కోరినట్లు చెప్పారు.

More Telugu News