: మాల్యాపై 420 కేసు నమోదు చేసిన సీబీఐ

ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాపై సీబీఐ 420 కేసు నమోదు చేసింది. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలుగా పొందిన విజయ్ మాల్యా 17 బ్యాంకులను 9 వేల కోట్ల రూపాయలకు నిలువునా ముంచేసి, లండన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ డిఫాల్ట్ కేసులో విజయ్ మాల్యాపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాల్యా దోషిగా నిర్ధారణ అయితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

More Telugu News