: తనను 'గారు' అని సంబోధించవద్దన్న ఎన్టీఆర్... 'సరే తారక్' అన్న నటుడు అజయ్!

'జనతా గ్యారేజ్' సినిమా ఆడియో వేడుక సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానుల మది దోచేశాడు. ఆడియో వేడుక సందర్భంగా సుమ ఈ సినిమాలో నటించిన అజయ్, బ్రహ్మాజీలను ఆహ్వానించింది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ, పెద్ద ఎన్టీఆర్ తో నటించే అవకాశం తనకు రాలేదని, అయితే ఆ లోటు జూనియర్ ఎన్టీఆర్ తో నటించి తీర్చుకున్నానని అన్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. అనంతరం అజయ్ మాట్లాడుతూ, సినిమాలో అవకాశం ఇచ్చిన కొరటాల శివగారికి ధన్యవాదాలు అన్నాడు. అలాగే తనపై నమ్మకముంచిన జూనియర్ ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు అని చెప్పాడు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ తను కూర్చున్న చోటు నుంచే కల్పించుకుని, తనను 'గారు' అని సంబోధించవద్దని వారించాడు. అయితే అజయ్ నవ్వి సరిచేసుకునేందుకు ప్రయత్నించకపోవడంతో, జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్ వద్దకు వెళ్లి 'ఏంటి? గారు అంటున్నావు?' అంటూ ప్రశ్నించారు. 'గారు తీసెయ్' అని సూచించారు. దీంతో అజయ్ 'సరే తారక్' అన్నాడు. దీంతో జూనియర్ 'గుడ్' అంటూ సైగ చేయగా, అభిమానులు మురిసిపోయారు.

More Telugu News