ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్'లో జూనియర్ ఎన్టీఆర్ వాడిన బైక్ ను సొంతం చేసుకోవాలనుందా?

Fri, Aug 12, 2016, 07:38 PM
Related Image 'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన బైక్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మరి మీ కోసమే ఆ సినిమా యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఛారిటీ కార్యక్రమంలో వితరణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో వాడిన బుల్లెట్ ను వేలం వేయనున్నట్టు తెలిపారు.

ఈ వేలం ద్వారా అభిమానులు వెచ్చించిన మొత్తాన్ని సమాజ సేవకు అందజేస్తామని చెప్పారు. ఇందుకు చేయాల్సిందంతా...'జనతా గ్యారేజ్.కామ్' వెబ్ సైట్ లోకి వెళ్లి... వెయ్యి రూపాయలు చెల్లించి రిజిస్టర్ కావాలని అన్నారు. వేలం ద్వారా దక్కించుకున్న బుల్లెట్ ను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అందజేస్తారని సుమ తెలిపింది. ఈ వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా 'జనతా గ్యారేజ్' సినిమా టికెట్లను దక్కించుకోవచ్చని సుమ చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Articles (Latest)
Articles (Education)