: జీహాద్ కాదు, క్రిష్టియన్ క్రూసేడ్ జరగాలి... మసీదును బెదిరించిన అమెరికా మాజీ సైనికుడు

అమెరికాలోని టెక్సాస్ లోని వటౌగాలో ఉన్న అల్ సహాబా మసీదు సెక్యూరిటీ సిబ్బందికి బెదిరింపులు వస్తుంటాయి. వాటిని వారు సర్వసాధారణంగా తీసుకుంటారు. గత వారం మసీదు ఆన్సరింగ్ మిషన్‌ కు వచ్చిన మెసేజ్ మాత్రం మసీదు సిబ్బందిని ఆందోళనలోకి నెట్టింది. ఈ మెసేజ్ ను అమెరికా మాజీ సైనికుడు పంపాడు. అందులో తనను తాను క్రైస్తవుడిగా అభివర్ణించుకున్న అతను... ఇస్లాం హింసాత్మక మతమని పేర్కొన్నాడు. అమెరికాలో ముస్లింలు షరియా చట్టాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. జీహాద్ కు పోటీగా క్రిస్టియన్ క్రూసేడ్ జరగాలని పిలుపునిచ్చాడు. అంతటితో ఆగని ఆ వ్యక్తి "మీ అందరి తలలు తెగ్గోస్తాం. అర్థమైందా, మీ అందరి తలలు తెగ్గోస్తాం" అని హెచ్చరించాడు. ఇలాంటి బెదిరింపులతో విసిగిపోయామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మసీదు సెక్యూరిటీ హెడ్ సైమన్ విన్సెంట్ చెప్పారు.

More Telugu News