: ఢిల్లీ యాక్సిడెంట్ ఘటనపై విదేశీ మీడియా విమర్శలు.. ప్రజల్లో మానవత్వం కరవైందని ఆవేదన

ఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఘటనపై విదేశీ మీడియా సైతం విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీ వాసుల్లో మానవత్వం కరవైందని ఆవేదన వ్యక్తం చేసింది. నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సెక్యూరిటీ గార్డు మతీబుల్‌ను ఓ ట్రక్కు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా కూడా వార్తలు ప్రచురించింది. తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన పడిపోయిన బాధితుడిని ఆదుకునేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా 400కు పైగా వాహనాలు అతడిని దాటుకునే వెళ్లినా ఒక్కరు కూడా బాధితుడికి సాయం చేసేందుకు ముందుకు రాలేదని పేర్కొంది. చివరికి ఓ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనం కూడా పట్టించుకోకపోవడంతో గంటపాటు కొన ఊపిరితో కొట్టుకుని బాధితుడు మృతి చెందాడని పేర్కొంది. ఢిల్లీలోని మిలియన్ల మందిలో ఒక్కరిలో కూడా బాధితుడికి సాయం అందించాలన్న స్పృహ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది.

More Telugu News