: బెజవాడ అసలు పేరు బెజ్జం వాడ... ఎలా అంటే...!: తనికెళ్ల భరణి వివరణ

కృష్ణా పుష్కరాల ప్రారంభం సందర్భంగా బెజవాడ పుట్టుపూర్వోత్తరాలను ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి వివరించారు. ఆయన మాటల్లో బెజ్జం వాడ...బెజవాడగా ఎలా మారిందంటే... సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టిన కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. సుదూర తీరాల నుంచి నురగలు కక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణవేణికి ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డం తగులుతుంది. అప్పుడు కృష్ణవేణి దారి ఇవ్వమని గిరుడ్ని ప్రార్థిస్తుంది. దయామయుడైన గిరుడు తన పర్వతాల్లో బెజ్జం ఏర్పర్చి కృష్ణవేణికి దారి ఇస్తాడు. అలా ఏర్పడినదే ఈ 'బెజ్జం వాడ' అని ఆయన చెప్పారు. కాలక్రమంలో వాడుక భాషలో ఇది బెజవాడగా రూపాంతరం చెందిందని ఆయన వెల్లడించారు.

More Telugu News