: 140 ఏళ్ల కింద మునిగిపోయిన నౌకను తాజాగా కనుగొన్న పరిశోధకులు

రష్యాలోని యానిసై నదిలో 140 ఏళ్ల క్రితం మునిగిన బ్రిటీష్ నౌక‌ ‘ది థేమ్స్‌’ తాజాగా బ‌య‌టప‌డింది. అప్ప‌ట్లో యూకే నుంచి సైబీరియా మ‌ధ్య‌లో ఆర్కిటిక్ స‌ముద్రంలో జ‌ల‌మార్గం ప్రారంభం చేయ‌డానికి వెళ్లిన ఈ నౌక మునిగిపోగా ఇంత‌వ‌ర‌కు దాని ఆచూకీ ల‌భించ‌లేదు. తాజాగా దాన్ని సైబీరియన్‌ స్టేట్‌ ఏరోస్పేస్‌ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలెగ్జాండర్‌ గోన్‌చార్వో తో పాటు ఓ టీమ్ గుర్తించింది. నౌక‌ను దాని వెనుక భాగం ఆధారంగా క‌నిపెట్టామ‌ని వారు చెప్పారు. న‌దిలో అడుగున ఇసుక‌లో ఈ నౌక ఎనిమిది మీట‌ర్ల‌ లోప‌లికి కూరుకుపోయి ఉంద‌ని వారు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌ సముద్రంలో ప్రయాణం ప్రారంభించిన ఈ నౌక బ‌రువు 120 టన్నులు ఉంటుంద‌ని, 1876లో జోసెఫ్‌ విగ్గిన్స్‌ అనే కెప్టెన్ నేతృత్వంలో ఇది బ‌య‌లుదేరింద‌ని చెప్పారు.

More Telugu News