: కోబ్రాతో సెల్ఫీ దిగాడు.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.. చివ‌రికి జ‌రిమానా చెల్లించుకున్నాడు!

కోబ్రాతో సెల్ఫీ దిగాడు. అంతేగాక, దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకి ల‌క్షకు మించి లైకులు రావ‌డంతో ఎగిరిగంతేశాడు. చివ‌రికి రూ.25 వేల జ‌రిమానా చెల్లించుకున్నాడు. వడోదరకు చెందిన వ్యాపార‌వేత్త‌ యాశేష్ బారోత్‌కు ఈ అనుభ‌వం ఎదురైంది. జంతు ప్రేమికులు కాపాడిన కోబ్రాతో సెల్ఫీ తీసుకొని చివ‌రికి బుక్క‌య్యాడు. ఫేస్బుక్ పేజీలో త‌న సెల్ఫీని పోస్టు చేయ‌డ‌మే కాకుండా 'వెయ్యి రూపాయిలకు కోబ్రా' అని క్యాప్షన్ పెట్టిన ఈ ఫోటోని వాట్సప్ నుంచి కూడా ఎంతో మంది షేర్ చేశారు. దీనిపై జంతు ప్రేమికులు అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన అట‌వీశాఖ అధికారులు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత ప్రాణులను అమ్మకానికి పెట్టడం నేరమని పేర్కొంటూ యాశేష్ కు రూ.25 వేలు జరిమానా వేశారు. రాకేష్ అధికారుల ముందు త‌న త‌ప్పుని ఒప్పుకొని, తాను చేసిన పోస్ట్‌ని డిలేట్ చేశాడు.

More Telugu News