: ఒలింపిక్స్ లో జూడో పతకం కొట్టిన హీరో... దొంగ చేతిలో దెబ్బలు!

బెల్జియం జూడో ఆటగాడు జుడోకా డిర్క్ వాన్ టిచెల్ట్... బ్రెజిల్ లోని రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భాగంగా జూడో 73 కేజీల విభాగంలో బరిలోకి దిగి కాంస్యం సాధించాడు. పతకం కొట్టానన్న ఆనందం అతనికి ఎంతో సేపు మిగలకుండా చేశాడో దొంగ. పతకాన్ని పొందిన తరువాత, సెలబ్రేట్ చేసుకోవడానికి తన స్నేహితుడితో టిచెల్ట్ తో కలసి కపకబానా బీచ్ కి వెళ్లాడు. వీరు సరదాగా గడుపుతున్న సమయంలో ఓ దొంగ కన్ను వీరిపై పడింది. వాన్ స్నేహితుడి ఫోన్ లాక్కున్న దొంగ పరుగు లంఘించగా, టిచెల్ట్ అతని వెంట పడ్డాడు. దొంగను పట్టుకోగా, అతను టిచెల్ట్ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చాడు. అది కంటిమీద తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్పందించిన సహచరులు టిచెల్ట్ ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇతనికి వైద్యం చేసిన డాక్టర్లు తీవ్రమైన గాయాలేమీ కాలేదని చెప్పారట.

More Telugu News