: ‘రియో’ అప్ డేట్స్: ఆర్చరీలో ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లిన బొంబేలా

రియో ఒలింపిక్స్ లో భారత మహిళా ఆర్చర్ బొంబేలా దేవి వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ప్రీ క్వార్టర్స్ కు దూసుకువెళ్లింది. ఈరోజు సాయంత్రం జరిగిన రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బాల్డఫ్ పై విజయం సాధించింది. అనంతరం రౌండ్ -32లో 6-2 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లిన్ షి చియాను ఓడించి, రౌండ్-16కు దూసుకెళ్లింది. చియాపై తొలి రెండు సెట్లు కైవసం చేసుకున్న బొంబేలా దేవి మూడో సెట్ ను కోల్పోయినప్పటికీ వెంటనే పుంజుకుంది. నాల్గో రౌండ్ లో మెరుగైన స్కోరు సాధించింది.

More Telugu News