: ఫెంటాస్టిక్ జాబ్... ప్రతిక్షణం ఆనందించా, ఇక గుడ్ బై: రాజన్

"మూడేళ్ల నా పదవీ బాధ్యతల వ్యవధి అద్భుతంగా సాగింది. మింట్ స్ట్రీట్ లో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించా. చివరి రోజున దేశానికి ఉపయోగపడేలా నేనేం చేశాను? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే తృప్తికరమైన సమాధానమే వస్తుంది" అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ఆర్బీఐ గవర్నర్ హోదాలో తుది పరపతి సమీక్షను నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు. రెపో రేటును తగ్గించకపోవడాన్ని సమర్థించుకున్నారు. మరో ఏడు నెలల తరువాత టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని దాటకుండా ఉంచాలంటే, రెపో, రివర్స్ రెపోలను తగ్గించరాదని భావించినట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కీలక రేట్లను మార్చకపోవడం సరైన నిర్ణయమేనని అనుకొంటున్నట్టు తెలిపారు. "ఏ సమయంలోనైనా విమర్శలు వస్తూనే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ మంది నేను మంచి పని చేస్తున్నానని సంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజానికి ఎంతో కొంత మేలు చేశాననే భావిస్తున్నా" అన్నారు.

More Telugu News