: ఫేస్ బుక్ పోస్ట్ లతో పరువుపోగొట్టిన వ్యక్తికి భారీ జరిమానా

ఒక హోటల్ పై ఫేస్ బుక్ లో అసభ్యకర కామెంట్లు పోస్ట్ చేసిన ఆస్ట్రేలియా వ్యక్తికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాకు చెందిన 74 సంవత్సరాల రోథీకి రెండు హోటళ్లు ఉన్నాయి. కుటుంబ గొడవల కారణంగా ఇళ్ల నుంచి వచ్చేసిన పిల్లలకు తన హోటళ్లలో ఆశ్రయం కల్పించేవాడు. ఈ విధంగా చేయడాన్ని తప్పుబడుతూ, ఈ హోటళ్లపై అసభ్యకర కామెంట్లు చేస్తూ డేవిడ్ స్కాట్ అనే ఎలక్ట్రీషియన్ 2014లో తన ఫేస్ బుక్ ఖాతాలో కామెంట్లు చేశాడు. చిన్నారులతో రహస్య వ్యభిచారం చేయిస్తున్నాడంటూ హోటల్ యజమానిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ పోస్ట్ ల కారణంగా ఆ హోటల్ కు అర్థంపర్థం లేని ఫోన్ కాల్స్ వస్తుండేవి. ఈ విషయమై స్కాట్ క్షమాపణలు చెప్పాలని రోథీ కోరాడు. ఇందుకు స్కాట్ ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో రోథీకి బెదిరింపులు రావడమే కాకుండా, ఆయనపై భౌతిక దాడులు కూడా జరగడంతో ఆరు నెలల పాటు చికిత్స నిమిత్తం ఆసుపత్రికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించిన రోథీ, జరిగిన విషయాలన్నింటిని పూసగుచ్చినట్లు కోర్టుకు విన్నవించాడు. ఈ నేపథ్యంలో హోటల్ యజమాని రోథీకి పరువు నష్టం కలిగించిన స్కాట్ కు లక్షా యాభై వేల డాలర్ల జరిమానా విధించింది.

More Telugu News