: పాక్ దుస్సాహసం!... కశ్మీర్ అల్లర్ల క్షతగాత్రులకు వైద్యమందిస్తామని ప్రతిపాదన!

పాకిస్థాన్ బరితెగింపు తనం మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే భారత బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని హీరోగా అభివర్ణిస్తూ పాకిస్థాన్ లోని ఉగ్రవాదులతో పాటు ప్రభుత్వం పలు ప్రకటనలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ ఉగ్రవాది ఆత్మ శాంతి కోసమంటూ ఆ దేశంలో బహిరంగంగానే ర్యాలీలు, సంతాప సభలూ జరిగాయి. ఓ వైపు వనీ ఎన్ కౌంటర్ తో జమ్ము కశ్మీర్ లో అల్లర్లు చెలరేగగా, వాటికి ఆజ్యం పోసేలా పాక్ వ్యవహరించింది. తాజాగా ఆ దేశం మరో దుస్సాహసం చేసింది. కశ్మీర్ అల్లర్లలో గాయపడ్డ వారికి తాము చికిత్స అందిస్తామంటూ ఓ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరిట ఓ ప్రకటన వెలువడినట్లు నిన్న ఆ దేశ పత్రిక ‘డాన్’ తెలిపింది. కశ్మీర్ లో గాయపడ్డ వారికి తాము చికిత్స చేస్తామని, ఇందుకు భారత్ ను ఒప్పించేలా అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

More Telugu News