: తల్లిదండ్రుల పోరు పడలేక... ఐఎస్ఐఎస్ కిడ్నాప్ డ్రామా ఆడిన యువకుడు... ముంబై పోలీసుల ఉరుకులు, పరుగులు

ఏదైనా ఉద్యోగం చేసి ఇంటి బాధ్యతల్లో పాలు పంచుకోవాలని తల్లిదండ్రులు బలవంతం చేస్తుంటే, ఆ యువకుడు ఏకంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని డ్రామా ఆడి ముంబై పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుజరాత్ కు చెందిన అనుజ్ ను, అతని కుటుంబ సభ్యులు ఉద్యోగం వెతుక్కోవాలని కోరుతుంటే, ముంబైకి వచ్చి బంధువుల ఇంట్లో మకాం వేశాడు. నిత్యమూ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయని అడుగుతుంటే, విసిగిపోయిన అనుజ్ కిడ్నాప్ ప్లాన్ వేశాడు. ఈ నెల 2వ తేదీన అతని స్నేహితుడు అంకిత్ కు ఓ మెసేజ్ పెట్టాడు. తనను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, నాలుగు రోజుల్లో చంపేస్తారని చెప్పాడు. దీంతో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఉగ్రవాదుల పేరు వినిపించేసరికి ఏటీఎస్ రంగంలోకి దిగింది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అనుజ్ ను వెతికి పట్టుకుని విచారించగా, విషయం బయటపడింది. ఆపై అనుజ్ కు కౌన్సెలింగ్ చేసిన పోలీసులు, అతని కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు.

More Telugu News