: తప్పులు పట్టుకోండి, రూ. 1.33 కోట్లు గెలవండి... యాపిల్ బంపర్ ఆఫర్

సాఫ్ట్ వేర్ అప్లికేషన్లలో లోపాలను వెతికి చూపే 'బగ్ బాంటీ'ని నిర్వహించాలని యాపిల్ ఐఎన్సీ నిర్ణయించింది. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి కంపెనీలు 'బగ్ బాంటీ'ని ఇప్పటికే నిర్వహించగా, తన ఉత్పత్తుల భద్రతపై ఉన్న నమ్మకంతో యాపిల్ ఇంతవరకూ రంగంలోకి దిగలేదు. ఇటీవల సిస్కో పరిశోధకులు ఐ ఫోన్లలో ప్రమాదకర బగ్స్ ఉన్నట్టు తేల్చడంతో, సెక్యూరిటీ లోపాలను వెలికితీయాలని భావించిన యాపిల్ ఈ బంపరాఫర్ ను ప్రకటించింది. ఐదు రకాల లోపాలను గుర్తించాలని చెబుతూ, వాటిని పట్టుకున్న వారికి 2 లక్షల డాలర్ల వరకూ (సుమారు రూ. 1.33 కోట్లు) బహుమతి ఇస్తామని ప్రకటించింది. బూట్ బగ్స్ ఏమైనా కనిపెడితే రూ. 1.33 కోట్లను, రహస్య సమాచారాన్ని దొంగిలించేలా చూసే లోపాలుంటే రూ. 62 లక్షలను, కోడ్ రన్ లోపాలు కనిపెట్టినా, సెక్యూరిటీ బగ్స్ గుర్తించినా రూ. 31 లక్షలు, సౌండ్ బాక్స్ టెస్టింగ్ విధానంలో వినియోగదారుల సమాచారాన్ని బయటకు తీసుకొస్తే రూ. 15.5 లక్షలను బహుమతిగా ఇస్తామని పేర్కొంది.

More Telugu News