: సరోగసీ కఠినతరం.. ఇక తెలిసిన వారికే అద్దె గర్భం!

సరోగసీ (అద్దెగర్భం) దుర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యాపారంగా మారిన సరోగసీపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధాని ఆదేశాలతో సమావేశమైన మంత్రుల బృందం(జీఓఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడింది. ఇక నుంచి ఎవరికి పడితే వారికి అద్దె గర్భం ఇవ్వడాన్ని నిషేధించనున్నారు. కేవలం తెలిసినవారు, రక్త సంబంధీకులు, ముఖ్యంగా భారతీయులు, సంతానలేమితో బాధపడుతున్నారు, పిల్లల్ని కనడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మాత్రమే అద్దె గర్భం ఇవ్వవచ్చని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అలాగే సరోగసీ తల్లులకు మరింత రక్షణ కోసం ప్రసవానంతరం రెండు నెలల పాటు కవర్ అయ్యేలా బీమా చేయించాలి. పిల్లలు అనారోగ్యంతో పుట్టినా, ఇతర సమస్యలు ఉన్నా తీసుకునేందుకు నిరాకరించే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ డ్రాఫ్ట్ బిల్లు కేబినెట్ ముందుకు రానుంది.

More Telugu News