ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాలేజ్ అమ్మాయికి మర్చిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన‌ హృతిక్ రోష‌న్‌

Sat, Aug 06, 2016, 08:46 PM
Related Image సింధులోయ నాగరికతను ఆవిష్కరిస్తూ హృతిక్‌రోషన్, పూజాహెగ్డే కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న సినిమా ‘మొహంజోదారో’. ఈ మూవీ ఆగస్టు 12న విడుదల కానున్న నేప‌థ్యంలో దాని ప్ర‌చారంలో భాగంగా ఢిల్లీలో తాజాగా హృతిక్ సంద‌డి చేశాడు. హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి అక్క‌డి ఓ ఉమెన్స్‌ కాలేజ్కి వెళ్లిన హృతిక్.. అక్క‌డి ఒక అమ్మాయికి త‌న‌తో క‌లిసి డ్యాన్స్ చేసే అవ‌కాశం పిలిచి మరీ ఇచ్చాడు.

హృతిక్, పూజా కాలేజీ అమ్మాయిల‌తో సరదాగా ముచ్చ‌టించారు. కాలేజీ అమ్మాయిలు అడుగుతోన్న ప్ర‌శ్న‌ల‌కు వారు జ‌వాబులిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ అమ్మాయి త‌న పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంద‌ని హృతిక్‌కి తెలిసింది. దీంతో ఆ అమ్మాయిని హృతిక్ వేదికపైకి ఆహ్వానించి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆమెతో కలిసి ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రంలోని హిట్ సాంగ్ సెనోరీటా పాట‌కు హృతిక్‌ డ్యాన్స్ చేశాడు. హృతిక్ తో డ్యాన్స్ చేసిన ఆ అమ్మాయి ఎంత‌గానో సంబ‌ర‌ప‌డిపోయింది. ఈ అనుభ‌వాన్ని తాను జీవితాంతం మర్చిపోలేన‌ని ఆకాశ‌మంత ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Articles (Latest)
Articles (Education)