: ఇండియాలో మా టార్గెట్ 100 కోట్లు: గూగుల్

ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్యను 100 కోట్లకు పెంచడమే తమ లక్ష్యమని గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం నెట్ వాడకందారుల సంఖ్య 35 కోట్లని వెల్లడించిన గూగుల్ ఆగ్నేయ ఆసియా, ఇండియా ప్రాంతాల ఉపాధ్యక్షుడు రాజన్ ఆనందన్, 2020 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎప్పటిలోగా టార్గెట్ అందుకుంటామన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. మరింత చౌకగా, వేగంగా ఇంటర్నెట్ ను అందించగలిగితే, లక్ష్య సాధన సులువేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారత్ లోని 27 ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్ టెల్ భాగస్వామ్యంతో ఫ్రీ వైఫై సేవలందిస్తున్నామని గుర్తు చేసిన ఆనందన్, ఈ సంఖ్యను మరింతగా పెంచనున్నామని తెలిపారు.

More Telugu News