ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రియో ఒలింపిక్స్.. ఆసక్తి కల్గించే అంశాలు

Thu, Aug 04, 2016, 09:56 PM
ఈ నెల 6వ తేదీ, శనివారం ఉదయం 4.30 గంటలకు (ఐఎస్ టీ) ఎంతో వైభవంగా ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు.
* రియో డి జనిరో లోని మరక్కానా స్టేడియంలో ఒలింపిక్ ప్రారంభ వేడుక జరుగుతుంది.
* ఈ స్టేడియం కెపాసిటీ 78,000+
* స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం. హిందీ, ఇంగ్లీషు భాషల్లో కామెంటరీ
* స్టార్ స్పోర్ట్స్.కామ్, హాట్ స్టార్.కామ్ లో లైవ్ స్ట్రీమింగ్
* ఒలింపిక్ క్రీడాకారుల పరేడ్ క్రమంలో మొదటగా గ్రీస్ దేశం స్టేడియంలోకి ప్రవేశించనుండగా, 95వ దేశంగా అడుగుపెట్టనున్న భారత్ క్రీడాకారులు. భారత్ జెండాను ధరించి మన టీమ్ ముందు నడవనున్న ఏస్ షూటర్ అభినవ్ బింద్రా
* ఆతిథ్య దేశం బ్రెజిల్ క్రీడాకారులు అన్ని టీమ్ ల కంటే చివరగా స్టేడియంలోకి అడుగుపెడతారు.
* ఓపెనింగ్ షో కు బ్రెజిల్ లో ప్రముఖ డైరెక్టర్ ఫెర్నాండో మీరెల్స్ కో-డైరెక్టు చేయనున్నారు. ఈ షోలో 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్ల డ్యాన్స్ లు
* హైలైట్స్... ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే దేశాల పరేడ్, ఒలింపిక్ ప్రతిఙ్ఞ, ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడి ప్రసంగం
* స్టార్ ఎట్రాక్షన్స్...బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెల్ బుండ్ చెన్, ట్రాన్స్ జెండర్ మోడల్ లీ టి, ప్రముఖ సింగర్ అనిత్తా సహా పలువురు మ్యుజిషియన్లు కేటనో వెలోసో, గిల్ బెర్టో గిల్ ల ప్రదర్శనలు
* ప్రముఖ నటులు జుడీ డెంచ్, ఫెర్నాండా మోంటెనెగ్రో లు పోయెట్రీ రీడింగ్
* యూఎన్ ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు సహా హాజరుకానున్న పలువురు ప్రముఖులు
* ఫుట్ బాల్ దిగ్గజం పీలే చేతుల మీదుగా ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
* ప్రపంచ వ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల ప్రజలు శనివారం ఉదయం రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను వీక్షించనున్నట్లు క్రీడా పండితుల అంచనా.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Articles (Latest)
Articles (Education)