: 'షీలా దీక్షిత్ వద్దనుకున్న సరుకు' బీఎస్పీ నేత సంచలన కామెంట్స్

వచ్చే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై బహుజన సమాజ్ పార్టీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య సంచలన కామెంట్లు చేశారు. ఆమె ఓ 'రిజెక్టెడ్ మాల్' (వద్దనుకున్న సరుకు - యూపీలో మహిళలను 'మాల్' అని పిలవడం సర్వసాధారణం) అని విమర్శించారు. ప్రసాద్ మౌర్య విమర్శలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మహిళల పట్ల ఆయనకున్న గౌరవానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించింది. కాగా, మహిళలను టార్గెట్ చేస్తూ, సీనియర్ పొలిటీషియన్లు సెక్సీ కామెంట్లు చేసి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే బీఎస్పీ చీఫ్ మాయావతిని వేశ్యతో పోలుస్తూ, బీజేపీ మాజీ నేత దయాశంకర్ సింగ్ తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అంతకుముందు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తన కొలీగ్ జయంతీ నటరాజన్ ను '100 శాతం నికార్సైన సరుకు' (100 పర్సెంట్ టంచ్ మాల్) అంటూ అభివర్ణించి, ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు.

More Telugu News