: నేడు ఢిల్లీకి చంద్రబాబు...పిలుపుకా? ప్రత్యేకహోదా సాధనకా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ వెళ్తున్నారు. నేటి పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీలను కలవనున్నారు. షెడ్యూల్ ప్రకారం రాజ్ నాథ్ సింగ్ ను కలవాల్సి ఉన్నప్పటికీ ఆయన సార్క్ సమావేశాల కోసం పాకిస్థాన్ వెళ్లినందున ఆయనను కలిసే అవకాశం కనిపించడం లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించ తలపెట్టిన కృష్ణా పుష్కరాల్లో పాల్గొనేందుకు రావాలని వారిని ఆహ్వానించేందుకు వెళ్తున్నారని సీఎంవో వర్గాలు పేర్కొనగా, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన కృష్ణా పుష్కరాల ఆహ్వానానికా? లేక రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై నిలదీసేందుకా? అన్నది అర్థం కాకుండా పోయింది. జీఎస్టీ బిల్లుపై మద్దతు కోసం అరుణ్ జైట్లీ ఫోన్ చేయగా, రాష్ట్రానికి హోదాపై ఫోన్ చేశారంటూ పార్టీ నేతలు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. హోదాకోసమైతే రాజ్యసభలో బిల్లుపై చర్చసందర్భంగా ఫోన్ చేయాలి కానీ, అంతా అయిపోయాక ఫోన్ ఏంటని కాంగ్రెస్ నేతలు విమర్శలు కూడా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News