: విజేతను నిర్ణయించేది వరుణుడే...చివరి రోజు ఆట జరుగుతుందా?

వెస్టిండీస్ తో ఆంటిగ్వాలో జరుగుతున్న రెండో టెస్టు విజేతను నిర్ణయించేది వరుణుడే. రెండో టెస్టు ప్రారంభమైన తొలి మూడు రోజులు టీమిండియా ఆధిపత్యం కొనసాగగా, నాలుగో రోజు మాత్రం వరుణుడు ఆధిపత్యం ప్రదర్శించాడు. తెల్లవారుజామునే భారీ వర్షంతో ఆంటిగ్వాను తడిపిముద్ద చేసి గంటన్నర ఆలస్యంగా మ్యాచ్ ఆరంభమయ్యేలా చేశాడు. అనంతరం కూడా పలు సందర్భాల్లో వరుణుడు మ్యాచ్ కు అడ్డంపడ్డాడు. దీంతో నాలుగో రోజు కేవలం 15.5 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది. ఈ సెషన్ లో బ్రాత్ వైట్ (23), చంద్రిక (1), బ్రావో (20), శామ్యూల్ (0) వికెట్లను టీమిండియా తీసింది. భారత బౌలర్లలో షమి రెండు వికెట్లతో రాణించగా, ఇషాంత్, మిశ్రా చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. ఇంక ఈ ఒక్క రోజే మిగిలి వుంది... వరుణుడు ఎలాంటి అడ్డంకి లేకుండా చేస్తే విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ ఆర్డర్ ఇప్పటికే పెవిలియన్ చేరడంతో అనుభవం లేని మిడిలార్డర్, టెయిలెండర్లను పెవిలియన్ కు పంపడం, విజయం సాధించడం టీమిండియాకు నల్లేరు మీద నడకే...అయితే వర్షం పడి ఆట రద్దయితే మాత్రం భారత్ ఓడకపోయినా వెస్టిండీస్ గెలిచినట్టే... ఒటమిని తప్పించుకుని డ్రా చేసుకోవడం విండీస్ జట్టుకు గెలుపుతో సమానం కనుక వరుణుడు విజేతను నిర్ణయించనున్నాడు.

More Telugu News