: బుర్హాన్ ఎన్ కౌంటర్ పై కాశ్మీర్ యువతకు క్షమాపణ చెప్పండి: పోలీసులను ఆదేశించిన మెహబూబా ముఫ్తీ

ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర నిరసనలకు దారి తీసిన నేపథ్యంలో, బుర్హాన్ కు వత్తాసు పలుకుతూ, అతన్ని చంపిన విషయంలో కాశ్మీర్ యువతకు క్షమాపణలు చెప్పాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. రోడ్లపైకి పోలీసులు వెళ్లవద్దని ఆమె నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముఫ్తీ ఆదేశాలు తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. కాశ్మీర్ పోలీసులు క్షమాపణలు చెప్పాల్సి వస్తే, ఆందోళనలు మరింతగా ఉద్ధృతం అవుతాయని ఆయన అన్నారు. మరోవైపు ముఫ్తీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News