: సరిహద్దుల వద్దకు వచ్చి భారత్ లోకి వెళ్లనివ్వాలని డిమాండ్ చేస్తూ, రాత్రి నుంచి హఫీజ్ సయీద్ కుమారుడి నిరసన

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీద్ సయీద్ తనయుడు తల్హా సయీద్ ఇండియాలోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నం చేస్తుంటే, పాక్ భద్రతా దళాలు ఆయన్ను నిన్నటి నుంచి అడ్డుకుంటున్నాయి. కాశ్మీరులో బాధితులను ఆదుకుంటామని చెబుతూ, 10 లారీల్లో ఆహార పదార్థాలను తీసుకుని చికోటీలోని బార్డర్ పోస్టుల వరకూ వచ్చిన ఆయన్ను పాక్ సైన్యం ముందుకు కదలనీయలేదు. జమాత్ ఉద్ దవా సోదర సంస్థ ఫలే ఇ ఇన్సానియత్ కు చైర్మన్ గా ఉన్న ఆయన, తన అనుచరులతో కలసి వచ్చి ఇండియాలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం నుంచి చికోటీ సమీపంలోని పాక్ ప్రాంతంవైపు బైఠాయించి నిరసన చేపట్టగా, అది నేడు కూడా కొనసాగుతోంది. ఇండియాలోకి వెళ్లనిచ్చేంత వరకూ సరిహద్దుల నుంచి కదిలేది లేదని ఆయన కూర్చోగా, అది జరిగే పని కాదని నచ్చజెప్పేందుకు పాక్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News