: రాజ్యసభ ముందుకు నేడు జీఎస్టీ బిల్లు!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఇప్పటికే పలు దఫాలుగా పార్లమెంటు ముందుకు వచ్చిన ఈ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు బీజేపీ చేయని యత్నమంటూ లేదు. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లా నిలిచే జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వాలని, బిల్లులో ఏవైనా మార్పు చేర్పులు సూచిస్తే వాటిని సవరిస్తామని కూడా మోదీ బహిరంగంగానే కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఎప్పటికప్పుడు ఈ బిల్లుకు ఆమోదం వాయిదా పడుతూనే వస్తోంది. ఈ దఫా ఎలాగైనా ఈ బిల్లుకు ఆమోదం పొంది తీరాలన్న పట్టుదలతో మోదీ సర్కారు వ్యూహం రచించినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభ కార్యకలాపాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

More Telugu News