ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అవుట్ డోర్ షూటింగులో డైరెక్టర్ ను ఆటపట్టించిన సమంత

Tue, Aug 02, 2016, 08:40 PM
Related Image టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తన చుట్టూఉన్న వాతావరణం కూడా ఉల్లాసంగా ఉండాలని భావిస్తుంది. తాజాగా 'జనతా గ్యారేజ్' షూటింగ్ లో ఉన్న సమంత డైరెక్టర్ కొరటాల శివను ఆటపట్టించింది. కేరళలోని పొలాచ్చిలో ఓ జలపాతం వద్ద 'జనతా గ్యారేజ్' పాట షూటింగ్ జరుగుతోంది. అక్కడి ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయిన సమంత ఆ జలపాతంలో తడవాలని అనుకుంది.

అయితే తానొక్కత్తినే తడిస్తే ఆనందం ఏముందని భావించిందో ఏమో కానీ...డైరెక్టర్ కూడా తడిస్తేనే షూటింగ్ కు వస్తానని షరతు పెట్టింది. అసలే రాష్ట్రం కాని రాష్ట్రంలో షూటింగ్... ఆపడం ఇష్టం లేని కొరటాల శివ ఆమెతో పాటు జలపాతం జల్లుల్లో తడిశాడు. దీంతో షూటింగ్ యూనిట్ మొత్తం ఈ జల్లుల్లో తడిసేలా చేసింది. దీంతో షూటింగ్ కు కొంత విరామం కలిగింది. ఈ విషయాన్ని సమంత ట్వీట్ చేస్తూ, అందుకు సంబంధించిన ఫోటో కూడా పోస్ట్ చేసింది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Articles (Latest)
Articles (Education)