ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇండిగో భారీ నష్టాలతో పాతాళానికి ఇంటర్ గ్లోబ్ వాటాలు!

Tue, Aug 02, 2016, 11:16 AM
Related Image ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో నష్టాలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ పై పడింది. ఇండిగో బ్రాండ్ పై విమానాలు నడుపుతున్న ఇంటర్ గ్లోబ్, ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో రూ. 529 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం క్యూ1లో నెట్ ప్రాఫిట్ రూ. 639 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ. 2014-15తో పోలిస్తే సరాసరి విమాన టికెట్ ధరలు 8 శాతం తగ్గాయని, అందువల్లే లాభం కూడా తగ్గిందని ఇంటర్ గ్లోబ్ అధ్యక్షుడు ఆదిత్యా ఘోష్ వెల్లడించారు. ఈ ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించగా, సంస్థ ఈక్విటీ పాతాళానికి పడిపోయింది. సెషన్ ప్రారంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 7 శాతానికి పైగా దిగజారిన ఈక్విటీ విలువ, 11:15 గంటల సమయంలో 6.13 శాతం పతనంతో రూ. 914 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 1,314 వద్ద ఉన్న ఈక్విటీ ఆపై ఫిబ్రవరి 11 నాటికి రూ. 722కు దిగజారి, ఆపై స్వల్పంగా తేరుకున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Articles (Latest)
Articles (Education)