: నాకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు... పతకాన్ని తెచ్చి మీకు బహుమతిగా ఇస్తా: నర్సింగ్ యాదవ్

డోపింగ్ వివాదంలో ఆటగాళ్లంతా తనకు వ్యతిరేకంగా నిలబడ్డప్పటకీ రెజ్లింగ్ సమాఖ్య, దేశ ప్రజలు, ప్రధాని మోదీ తన పక్షాన నిలబడ్డారని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తెలిపాడు. గత పది రోజులుగా గడ్డు రోజులు ఎదుర్కొన్నానని చెప్పాడు. అయితే ప్రజలు తన పక్షాన నిలిచి, తనకు ప్రతిక్షణం ధైర్యం చెప్పారని అన్నాడు. ఇలాంటి వివాదాల్లో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతాయని, తన గురించి ఎవరూ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్య చేయకపోవడం తనపై వారు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమని నర్సింగ్ యాదవ్ తెలిపాడు. ఇంత మానసిక స్థైర్యం ఇచ్చిన దేశ ప్రజలకు తానివ్వగలిగింది...రియో ఒలింపిక్స్ నుంచి పతకంతో తిరిగి రావడమేనని అన్నాడు. పతకాన్ని గెలుచుకుని వచ్చి తనను ప్రోత్సహించిన వారందరికీ బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నానని తెలిపాడు. తనను దీవించాలని నర్సింగ్ యాదవ్ కోరాడు.

More Telugu News