: గుజరాత్ సీఎం ఆనందీబెన్ ప‌టేల్ రాజీనామా అందింది: అమిత్ షా

వయసు మీదపడడంతో త‌న‌ బాధ్యతలు మోయలేకపోతున్నానంటూ గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ చేసిన రాజీనామాను భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్ఠానానికి చేరింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధాని కావ‌డంతో ఆమె గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మే 22, 2014లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం రాష్ట్రంలోని పటేళ్ల ఉద్యమం ఆమెను ఇర‌కాటంలోకి నెట్టేసింది. తాజాగా గుజ‌రాత్‌లో ద‌ళితుల‌పై దాడి అంశం ఆమెపై ఒత్తిడి పెంచిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్ఠానం కొత్త‌ ముఖ్య‌మంత్రిని నియ‌మించే అవ‌కాశం ఉంది.

More Telugu News