: రెండు పెద్ద దేశాలను కలిపిన 32 అడుగుల వంతెన

ఓ చిన్న బ్రిడ్జి రెండు పెద్ద దేశాలను కలుపుతోంది. నార్త్ అమెరికా ఖండంలో అతి పెద్ద దేశాలైన యూఎస్ఏ, కెనడాలను 10 మీటర్లు కూడా లేని ఓ చిన్న వంతెన కలుపుతోందంటే నమ్మగలరా? నమ్మినా నమ్మకున్నా అది నిజం. న్యూయార్క్‌ తీరప్రాంతం నుంచి కెనడాలోని ఒంటారియో తీర ప్రాంతం వరకు వందల సంఖ్యలో దీవులున్నాయి. ఈ దీవులు కొన్ని అమెరికా అధీనంలో ఉండగా, మరికొన్ని కెనడా అధీనంలో ఉన్నాయి. అయితే ఈ దీవుల్లో అమెరికా అధీనంలో ఉన్న జవికాన్‌ ద్వీపం, కెనడా అధీనంలో ఉన్న ద్వీపం బాగా దగ్గరగా ఉంటాయి. వీటి మధ్య దూరం కనీసం పది మీటర్లు కూడా లేకపోవడం విశేషం. దీంతో జవికాన్ ద్వీపం నుంచి కెనడా ద్వీపానికి 32 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు. దీంతో పది మీటర్లు కూడా లేని ఈ వంతెన రెండు దేశాలను కలిపిన అతిచిన్న వంతెనగా రికార్డు పుటలకెక్కింది.

More Telugu News