: ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్ ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ పెళ్లి కొడుకయ్యాడు. ప్రియురాలితో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు. డోమినికన్ రిపబ్లిక్ కు చెందిన మోడల్ జాసిమ్ లోరాతో ప్రేమలో పడ్డ రస్సెల్ చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతున్నాడు. దీంతో 2014లో వీరి ప్రేమకి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వివాహంతో అనుబంధాన్ని బంధంగా మార్చుకున్నారు. తన వివాహ ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పెట్టిన రస్సెల్ 'ఏ విషయంలోనైనా దేవుణ్ని ముందుంచుకోవాలి.. ఆయనే దారి చూపిస్తాడు' అంటూ పేర్కొన్నాడు. కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టార్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ యాజమాన్యం, విండీస్ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News