: గోవుల సంరక్షణ చేపడుతున్నారు సరే.. మానవుల రక్షణ ఎవరు చేపడతారు?: కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి, దళిత నాయకుడు రాందాస్‌ బాండు అథావాలె ఓ జాతీయ దిన‌ప‌త్రికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గోవుల మాంసం స‌ర‌ఫ‌రా చేస్తున్నారంటూ ఇటీవ‌ల జ‌రిగిన ద‌ళితుల‌పై దాడి అంశంపై ఆయ‌న మాట్లాడుతూ.. గోవుల సంర‌క్ష‌ణ అంటూ మాన‌వుల‌పై దాడులు చేస్తూ వారిని చంపుతే వెళితే, మ‌రి మ‌నుషుల‌ని ఎవరు ర‌క్షిస్తార‌ని అన్నారు. మ‌నుషుల‌ను బాధిస్తూ గోవుల సంర‌క్ష‌ణ కొన‌సాగించ‌డం భావ్యం కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ద‌ళితుల‌పై దాడుల ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం పటిష్ట‌మ‌యిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాందాస్‌ అన్నారు. దళితులు బుద్ధిజంలోకి మారాలని రాందాస్ సూచించారు. మాయావ‌తిపై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌ళితుల కోసం కృషి చేస్తున్నాన‌ని చెబుతోన్న మాయావ‌తి బుద్ధిజంలోకి ఎందుకు మార‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

More Telugu News