: హిందూ మహిళకు కిడ్నీ దానం చేయనున్న ముస్లిం మహిళ.. ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న వైద్యులు

హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న ఘర్షణలను పక్కనపెడితే ఓ ముస్లిం మహిళ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న హిందూ మహిళకు తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. మానవత్వానికి మతంతో సంబంధం లేదని నిరూపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన షంషాద్ బేగం(40) భర్త పదేళ్ల క్రితం మృతి చెందడంతో తండ్రితో కలిసి ఉంటోంది. ఇటీవల తన సోదరి జునైదా బేగంను చూసేందుకు పుణెలోని మానస సరోవర్ ప్రాంతానికి వెళ్లిన షంషాద్ బేగంకు అక్కడ తన సోదరి స్నేహితురాలైన ఆరతి(38)తో పరిచయం ఏర్పడింది. రెండు కిడ్నీలు చెడిపోయి ఏడాది కాలంగా ఆరతి డయాలసిస్ చేయించుకుంటోందని తెలిసిన బేగం మరోమాట లేకుండా తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అందుకు కావాల్సిన పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరి బ్లడ్ గ్రూపులు ఒకటే కావడంతో ఆపరేషన్‌కు అడ్డు తొలగిపోయింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామని ఫతేపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినయ్ కుమర్ తెలిపారు.

More Telugu News