: పాకిస్థాన్ క్రికెటర్లలో ఈ ఏడాది అత్యధిక సంపాదనాపరులు వీరే!

పాకిస్థాన్ క్రికెటర్ల ఈ ఏడాది సంపాదన వివరాలను పీసీబీ అక్కడి ప్రభుత్వానికి అందజేసింది. అందులో ఈ ఏడాది దేశంలోని అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న 40 మంది క్రికెటర్లకు బోనస్ రూపంలో 55 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిపింది. ఈ నివేదికలో పాకిస్థాన్ క్రికెటర్లలో అత్యధిక సంపాదనా పరుడు హఫీజ్ సయీద్ అని పీసీబీ పేర్కొంది. హఫీజ్ సయీద్ 2015-16 ఆర్ధిక సంవత్సరానికి గాను 36 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు సంపాదించాడు. అతని తరువాతి స్థానంలో సర్ఫరాజ్ అహ్మత్ 33 మిలియన్ పాక్ రూపాయలు, ఆ తరువాతి స్థానంలో 18 మిలియన్ పాక్ రూపాయలతో షాహిద్ అఫ్రిదీ నిలిచాడు. ఈ లెక్కన పాకిస్థాన్ క్రికెటర్లలో అత్యధిక సంపాదనాపరుడైన హఫీజ్ సయీద్ భారత్ కరెన్సీలో 2.49 కోట్ల రూపాయలు సంపాదించాడు. అదే టీమిండియా టెస్టు కెప్టెన్ సంపాదన ఏడాదికి 309 కోట్ల రూపాయలు. కోహ్లీ సంపాదనలో హఫీజ్ సయీద్ సంపాదన కేవలం ఒక్కశాతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.

More Telugu News