: ఢిల్లీ కన్నా ఘోరంగా బెంగళూరు... ఐటీ ఉద్యోగుల తరలింపునకు రోడ్లపైకి వచ్చిన బోట్లు!

నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెంగళూరులో పరిస్థితి ఢిల్లీలో కన్నా దారుణంగా మారింది. ముఖ్యంగా దక్షిణ బెంగళూరు పరిధిలో ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ తదితర కంపెనీల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు తమ వాహనాలు బయటకు తీయలేక, ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరలేక చిక్కుకుపోయారు. పలు ఐటీ ఆఫీసుల్లోని సెల్లారులన్నీ వరదనీటిలో చిక్కుకుపోగా, రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పల్లపు ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులను ఎత్తయిన ప్రాంతాలకు చేర్చేందుకు రోడ్లపైకి పడవలు వచ్చాయి. ఫైర్ డిపార్టుమెంట్ విభాగం రెస్క్యూ టీములు రంగంలోకి దిగి నీటిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేరుస్తున్నాయి. అసలే ఆర్టీసీ సమ్మెతో బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఈ భారీ వర్షాలు మరింతగా ఇబ్బందులకు గురి చేశాయి.

More Telugu News