: టర్కీ తిరుగుబాటు వెనుక బిజినెస్ టైకూన్ల హస్తం!... ముగ్గురు వ్యాపారవేత్తలు అరెస్ట్!

ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసిన టర్కీ సైనిక తిరుగుబాటుకు గల కారణాలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. తిరుగుబాటు కారణాలను విశ్లేషిస్తున్న ఆ దేశ పోలీసులు నేటి ఉదయం ముగ్గురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను అదుపులోకి తీసుకున్నారు. నేటి ఉదయమే రంగంలోకి దిగిన పోలీసులు బాయ్ డాక్ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ ముస్తఫా బాయ్ డాక్ తో పాటు ఆ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అదికారులు సక్రూ, హాలిత్ బాయ్ డాక్ లను వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకున్నారు. ఇక బాయ్ డాక్ మాజీ చైర్మన్ హాకీ బాయ్ డాక్, ఆ సంస్థకు చెందిన మరో ఇద్దరు ప్రముఖులు ఇలియాస్, బెకీర్ బాయ్ డాక్ ల అరెస్ట్ కోసం కూడా వారెంట్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆ దేశ రాజకీయవేత్త ఫెతుల్లా గులెన్ ఆదేశాల మేరకు ఈ పారిశ్రామికవేత్తలంతా నిధులు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతోనే పారిశ్రామికవేత్తల అరెస్టులు మొదలయ్యాయి.

More Telugu News