: రష్యాకు లైన్ క్లియర్... ఐఓసీ నిర్ణయంపై వాడా తీవ్ర అసంతృప్తి

రియోలో జరిగే ఒలింపిక్స్ పోటీల నుంచి రష్యాను బహిష్కరించలేమని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పగా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (వాడా) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రష్యా ప్రభుత్వమే స్వయంగా పలు క్రీడా విభాగాల ఆటగాళ్లతో ఉత్ప్రేరకాలను వాడిస్తోందని మెక్ లారెన్ కమిటీ సాక్ష్యాలతో సహా నివేదిక ఇచ్చినప్పటికీ, ఐఓసీ దాన్ని పట్టించుకోలేదని 'వాడా' ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, రియో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి మాత్రమే పతకాలు, గుర్తింపు రావాలన్నది తమ అభిమతమని, ఐఓసీ చర్యలతో ఏ రష్యా ఆటగాడికి పతకం లభించినా, ప్రపంచమంతా అనుమానంతో చూసే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. రియో పోటీలకు ఏ రష్యా అధికారి కూడా హాజరు కాకుండా చూడాలని వాడా కోరగా, దాన్ని సైతం అంగీకరించలేమని ఐఓసీ పేర్కొంది.

More Telugu News