: భవంతి తెలుగు చిత్ర పరిశ్రమదే... 13 మంది మిస్సింగ్

ఫిలింనగర్ లో కుప్పకూలిన భవనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ సాంస్కృతిక సంఘం ఫిలింనగర్ కల్చరల్ అసోసియేషన్ స్వయంగా నిర్మిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గత రెండు వారాల వ్యవధిలో రెండు ఫ్లోర్లను ఇక్కడ వేయడం, ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం, నాసిరకం పనుల వల్ల ఈ భవంతి కుప్పకూలినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూలి పనులకు వచ్చిన వారిలో 13 మంది కనిపించడం లేదని సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పది మందిని సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా, పలువురు ప్రజలు శిథిలాలను పక్కకు తొలగించే పనిలో సాయపడుతున్నారు. ఈ భవంతిలో చిత్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న పలు సంఘాల అవసరాలు తీర్చే నిమిత్తం కొన్ని ఫ్లోర్లను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో 14 పిల్లర్లు నేలమట్టం కాగా, ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీసిన సంగతి తెలిసిందే.

More Telugu News