: ఈ గుడికి వెళ్తే దొంగతనం చేయాలట!

ఉత్తరాఖండ్ లోని రూర్కీ జిల్లా చేడియాల గ్రామంలోని చూడామణి ఆలయం స్పెషాలిటీ ఇది. ఇక్కడికి వచ్చే భక్తులు, అమ్మవారిని దర్శించుకుని దొంగతనం చేయాలట. అలా చేస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. ఇక ఏ బంగారాన్నో, అమ్మ ఆభరణాలనో దొంగతనం చేయాలా? అని అనుకోకండి. ఇక్కడి దేవతా విగ్రహం పాదాల వద్ద అమ్మ ప్రతిరూపంలో చెక్క బొమ్మలు ఉంటాయి. అటూ ఇటూ చూసి వాటిని నొక్కేయడమే భక్తులు చేయాల్సిన పని. ఆ పని చేస్తే, వారికి సంతానం కలుగుతుందట. పిల్లలు పుట్టిన తరువాత, తిరిగి తాము దొంగిలించిన చెక్క ప్రతిరూపాన్ని, అటువంటిదే ఇంకోదాన్ని తెచ్చి అక్కడ పెట్టి వెళ్లిపోవాలట. దాన్ని మరొకరెవరో దొంగిలించుకు పోతారు. ఈ వింతైన ఆచారంతో చూడామణి ఆలయం రోజురోజుకూ మరింత మంది భక్తులను ఆకర్షిస్తోంది.

More Telugu News