: సైనిక తిరుగుబాటు కారకుడు గులెన్ సంస్థలు మూసేయాలని పాక్ ను కోరిన టర్కీ

తమ దేశంలో సైనిక తిరుగుబాటుకు కారణమైన గులెన్‌ పై చర్యలు తీసుకునేందుకు టర్కీ ఉపక్రమించింది. టర్కీని అతలాకుతలం చేసిన గులెన్ పై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ను కోరింది. టర్కీ రాయబారి సాదిక్ బాబర్ గిర్గిన్ పాకిస్తాన్ లో గులెన్ నిర్వహిస్తున్న సంస్థలు, వ్యాపారాలను మూసివేయాలని కోరారని 'డాన్' పత్రిక పేర్కొంది. టర్కీ సైనిక తిరుగుబాటుకు గులెన్ ప్రధానకారకుడనేందుకు తగిన ఆధారాలు టర్కీ వద్ద ఉన్నాయని ఆయన పాకిస్థాన్ కు తెలిపారని డాన్ తెలిపింది. గులెన్ కార్యకలాపాలను స్తంభింపజేయాలని పాకిస్థాన్ సహా మిత్రదేశాలన్నింటినీ కోరుతున్నామని టర్కీ తెలిపిందని డాన్ కథనంలో పేర్కొంది. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో ఉన్న గులెన్ ను అప్పగించాలని ఆ దేశాన్ని టర్కీ కోరుతున్న సంగతి తెలిసిందే. గులెన్ అజ్ఞాతంలో ఉంటూ పాకిస్తాన్ లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని టర్కీ కోరింది. ఉగ్రవాదులను పెంచి పోషించే పాక్ దీనిపై స్పందించాల్సి ఉంది.

More Telugu News