: దక్షిణ చిలీలో తీరానికి కొట్టుకొచ్చిన 70 నిర్జీవ తిమింగలాలు

భారీ సంఖ్యలో తిమింగలాల కళేబరాలు తీరానికి కొట్టుకొచ్చిన సంఘటన దక్షిణ చిలీలోని పాంటగోనియన్‌ ప్రాంతంలో కనిపించింది. మొత్తం 70 నిర్జీవ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చినట్లు, వీటి సైజు గత ఏడాది డిసెంబర్‌లో చనిపోయిన తిమింగలాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు చిలీ మత్స్య శాఖ అధికారులు తెలిపారు. తాజాగా కొట్టుకొచ్చిన తిమింగలాల కళేబరాలు రెండు నెలల క్రితం చనిపోయి ఉండొచ్చని వారు పేర్కొన్నారు. గతేడాదిలో ఏకంగా 330 తిమింగలాల కళేబరాలు పాంటగోనియన్‌ ప్రాంతంలో తీరానికి కొట్టుకొచ్చినట్లు వారు తెలిపారు. ఇవి కొట్టుకొస్తోన్న కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, వాతావరణ మార్పుల కారణంగా చనిపోయాయో, మనుషులే వాటిని చంపేశారో తేల్చాసి ఉందని చెప్పారు. అయితే, సముద్రంలో జరుగుతోన్న ఆల్గల్‌ బ్లూమ్‌ వల్ల తిమింగలాలు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

More Telugu News