ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ట్రంప్ కు కేన్సర్ భయం, హిల్లరీకి హైపో థైరాయిడిజమ్!

Thu, Jul 21, 2016, 11:06 AM
Related Image ప్రజల్ని పాలించేవారు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సమర్థవంతమైన పాలన ఉంటుంది... వినేందుకు ఇది కాస్త అసంబద్ధంగానే ఉన్నప్పటికీ, పాలకులు ఆరోగ్యవంతులై ఉండాలని అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కోరుకుంటారు. ఇండియాలో ఈ దిశగా ఆలోచించేంత తీరిక కూడా ప్రజల్లో కనిపించకపోయినా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ, అభ్యర్థుల ఆరోగ్యం సైతం ఓట్లను ఆకర్షించేదే. ఈ నేపథ్యంలో బరిలోకి దిగే డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ల మీద బులెటిన్లు విడుదల అవుతున్నాయి. ఆ వివరాలు సైతం గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. తాజా బులెటిన్ ప్రకారం...

డొనాల్డ్ ట్రంప్...
* 70 సంవత్సరాల ట్రంప్ వైద్య నివేదికలో కొన్ని వివరాలే ఉన్నాయి.
* పదేళ్ల వయసులో అపెండిసైటిస్ శస్త్రచికిత్స జరిగింది.
* ప్రొస్టేట్ కేన్సర్ రావచ్చన్న భయంతో క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటారు.
* బీపీ నార్మల్, కొలెస్టరాల్ ఉంది. దానికి మందులు (స్టాటిన్స్) వాడుతున్నారు.
* గుండెపోటు వచ్చే సమస్య కూడా ఉంది.
* కొలోన్ కేన్సర్ నుంచి తప్పించుకునేందుకు మందులు వాడుతున్నారు.
* ఏడాదిలో 15 పౌండ్ల బరువు పెరిగారు.
* రోజుకు మూడు నుంచి నాలుగు గంటలే నిద్రిస్తారు.

హిల్లరీ క్లింటన్...
* 69 సంవత్సరాల హిల్లరీకి బీపీ, కొలెస్టరాల్ లేవు.
* ఇటీవల గుండె పరీక్షలు చేయించుకుంటే అంతా నార్మల్.
* 2012లో మెదడులో రక్తనాళాలు గడ్డకట్టాయి.
* ఆపై కోలుకున్న హిల్లరీ, మళ్లీ ఇదే పరిస్థితి రాకుండా రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నారు.
* హైపో థైరాయిడిజమ్ ఉంది. దీంతో హార్మోన్ మందులు, విటమిన్ బీ12 ఔషధాలు వాడుతున్నారు.
* ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, యోగా, నడక చేయడంతో పాటు, పళ్లు, కూరగాయలు అధికంగా తింటారు.
* సమయానుసారంగా వైద్య పరీక్షలు చేయించుకుంటారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Articles (Latest)
Articles (Education)