: ముంబయిలో ‘కబాలి’ థీమ్ తో బస్సు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం ఈ వేళ హాట్ టాపిక్. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఆ చిత్రం గురించిన ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా, ముంబయిలోని ఫాక్స్ స్టార్ స్టూడియో ‘కబాలి’ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించింది. ముంబైలోని వాడాలా నుంచి ఇనార్బిట్ మాల్ వరకు నడిచే ఈ బస్సును ‘కబాలి’ థీమ్ తో ముస్తాబు చేశారు. బస్సులోని యువకులు మధ్య మధ్యలో డ్యాన్స్ లు చేస్తూ రజనీ అభిమానులను ఉత్సాహపరిచారు.

More Telugu News