: ముషార్రఫ్ కు షాక్!... పాక్ మాజీ అధ్యక్షుడి ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశం!

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ కు నిన్న మరో ఎదురు దెబ్బ తగిలింది. సైనిక చర్య ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన ముషార్రఫ్ ఆర్మీ చీఫ్ నుంచి దేశాధ్యక్ష పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడటం, ముషార్రఫ్ గద్దె దిగడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయనపై తిరుగుబాటు, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వైద్య చికిత్సల పేరు చెప్పి దుబాయ్ పారిపోయిన ఆయన ఈ కేసుల విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఇస్లామాబాదులోని ప్రత్యేక కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News