: పట్టణాల్లో వుండే పక్షులు మహా దూకుడుగా ఉంటాయట!

పల్లెల్లో పెరిగిన యువకులు, పట్టణాల్లో పెరిగే యువకుల మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. పల్లెల్లో పెరిగిన యువకులు, కుటుంబం, బంధాలు, బాధ్యతలు తెలిసి ఉంటే... పట్టణ యువత జీవితాన్ని అనుభవించడం, కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటారు. ఈ తేడా కేవలం మనుషుల మధ్యేకాదు, పక్షుల మధ్య కూడా ఉంటుందని పరిశోధకులు నిరూపించారు. అమెరికాలోని వర్జినీయా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు స్కాట్ డేవిస్ పక్షుల స్వభావాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన పరిశోధనల్లో పట్టణాలు, పల్లెల్లో నివసించే పక్షుల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని కనుగొన్నారు. పట్టణాల్లో ఉండే పక్షులు గ్రామాల్లో ఉండే వాటికంటే కోపంగానూ, దూకుడు స్వభావంతో ఉంటాయని ఆయన గుర్తించారు. దీనికి కారణం పట్టణాల్లో ఉండే పక్షులకు ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ అవి నివసించేందుకు స్థలం తక్కువగా ఉంటుందని, పల్లెల్లో వనరుల సంగతి ఎలా ఉన్నా అవి స్వేచ్ఛగా విహరించేందుకు సరిపడా స్థలం ఉంటుందని, అందుకే అవి శాంతంగా ఉంటాయని ఆయన సూత్రీకరించారు. దీంతో పక్షుల స్వభావాలపై జనసాంద్రత తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెబుతున్నారు. పిచ్చుకల స్వరాల్లో తేడాలపై పరిశోధనలు చేసిన అనంతరం... గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పిచ్చుకల స్వరంలో స్పష్టమైన తేడాలను గమనించి, వాటి దూకుడును అంచనా వేసినట్టు ఆయన తెలిపారు.

More Telugu News