: వందరోజుల్లో ప్రేమ ఎలా పుడుతుందనేది చెప్పాం!: నిత్యా మీనన్

'100 డేస్ ఆఫ్ లవ్' సినిమా హాలీవుడ్ టచ్ ఉన్న 'అలా మొదలైంది' లాంటి సినిమా అని నిత్యా మీనన్ తెలిపింది. ఈ సినిమాలో దుల్ఖర్ సల్మాన్, తన స్నేహితుడు శేఖర్ మేనన్ తో కలిసి నటించానని చెప్పింది. అబ్బాయిలిద్దరూ గాలికి తిరుగుతుంటే... తాను మాత్రం బాధ్యత కలిగిన ఉద్యోగినిగా నటించానని తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రాక్టికల్ గా ఉంటుందని చెప్పింది. వందరోజుల్లో ప్రేమ ఎలా పుడుతుందనేది ఈ సినిమాలో చెప్పామని తెలిపింది. వాస్తవానికి ఈ సినిమాను మలయాళంలో నిర్మించినప్పటికీ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని, తానే ఈ సినిమాను డబ్ చేయమన్నానని నిత్య తెలిపింది. ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నిత్య ఆశాభావం వ్యక్తం చేసింది.

More Telugu News